బాలీవుడ్ ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్ ను ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగేలా సమాధానమిచ్చాడు. తాజాగా ఓ అభిమాని ‘మీ నాన్న ఆసుపత్రిలో ఉన్నారు కదా.. ఇక ఎవరి భరోసాతో కూర్చుని తింటావ్..?’ అంటూ ప్రశ్నించింది. అయితే దీనికి అభిషేక్ ఓ కూల్ రిప్లై ఇచ్చారు. ‘ప్రస్తుతానికి కూర్చుని కాదు.. పడుకుని భోజనం చేస్తున్నా. మా నాన్న కూడా నాతోనే ఆసుపత్రిలో ఉన్నారు’ అంటూ అభిషేక్ రిప్లై ఇచ్చారు.
Your father admitted in hospital… Ab kiske bharose baith ke khaoge?
— Parul Kaushik (@ParulGang) July 29, 2020
ఇదిలా ఉంటే ఈ రిప్లై చూసిన అభిషేక్ ఫాన్స్ ఖుషీ అయిపోతున్నారు. అంతేకాకుండా ఆ నెటిజన్‌పై మండిపడుతున్నారు. కరోనా బారిన పడడంతో అమితాబ్, అభిషేక్ లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల బిగ్ బీ ఫ్యామిలీపై అనేక మంది ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఓ ట్రోలర్ కామెంట్‌పై అమితాబ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ట్రోలర్స్ అభిషేక్‌ను టార్గెట్ చేశారు.