వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ కి మరోసారి షాక్ ఇచ్చారు విశాఖ పోలీసులు. ఆర్కే బీచ్ లో వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. ఏయూ గ్రౌండ్ లో నిర్వహించుకోవాలని సిపి చెప్పారు. ఆర్కే బీచ్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అనుమతి లేదంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక గందరగోళంలో ఉన్నారు నిర్వాహకులు.
అభిమానులు సైతం నిరాశకి గురవుతున్నారు. తొలుత పోలీసులు అభ్యంతరం చెప్పడంతో విశాఖ ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్ లో నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా పోలీసులు అనుమతి ఇచ్చారని ఆర్కే బీచ్ లోనే ఈవెంట్ జరుగుతుందని మూవీ యూనిట్ తెలిపింది. కానీ సమయానికి ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.