మంచి స్నేహితుడికి ప్రాణ సమాన ప్రేమకు
ప్రణామం చెప్పాలి.. స్నేహం గొప్పదనం లోకానికి చాటాలి
చాటింపు వేయాలి.. స్నేహం కారణంగా ఓ నయా మెగా ప్రాజెక్టు
గడ్డు కాలం నుంచి ఒడ్డెక్కింది.. అందుకు ఓ వ్యక్తి పరోక్షంగా కారణం
ఎలా అంటే ?
గతం కన్నా ఇప్పుడు కొన్ని చాలా సంక్లిష్టంగానే ఉన్నాయి. గతం కన్నా ఇప్పుడు కొన్ని ఆర్థికంగా కూడా పెను సవాళ్లను మోసుకుని వస్తున్నాయి. కనుక తాము ప్రభుత్వాలను అర్థించామే తప్ప అడుక్కోలేదని చిరు వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా నాలుగేళ్లు మరో ప్రాజెక్టు జోలికి పోలేదు దర్శకులు కొరటాల శివ. ఆ విధంగా చూసుకుంటే ఆయన రెమ్యునరేషన్ ఎంత ? ఎంత మేరకు చెల్లించాలి ? అయినా మా అకౌంట్లేవీ చూసుకోలేదు అండి అవన్నీ విడుదల తరువాత అని వినమ్రంగా చెప్పే దర్శకుడు శివ. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి నిర్మాత చేసిన కొన్ని అప్పులకు సంబంధించి కూడా దర్శకుడే హామీగా ఉన్నారని కూడా తెలుస్తోంది. అయినా కూడా ఆ టెన్షన్ ఆయన ఫేస్ లో లేదు. మాటలో లేదు. అసలు ఏ తరహా తొట్రుపాటు కూడా లేదు.
అందుకు కారణం ఓ వ్యక్తి.. తెర వెనుక ఎవరాయన ?
కరోనా కారణంగా సినిమా నిర్మాణ విషయంలోనూ,ఇంకా ఇతర విషయాల్లోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు మెగాస్టార్ చిరు. అందేంటి చిరూకు ఇబ్బందులా అని ఆశ్చర్యపోకండి. ఇప్పుడాయన ప్రొడ్యూసర్ కూడా ! ఆయన నిర్మాణ సారథ్యం నేరుగా లేకున్నా ఆయన రెమ్యునరేషన్ అంతా సినిమా బడ్జెట్ కింద పరిగణించేదే! ఆ విధంగా ఆచార్య సినిమా విషయంలో ఆ ఇద్దరూ అన్నీ తామై నిలిచారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా చిరు జీవన సహచరి సురేఖ డ్రీమ్ ప్రాజెక్టు కూడా ! తండ్రీ,కొడుకులు కలిసి నటిస్తే చూడాలన్నది ఆ మాతృమూర్తి కోరిక.ఈ రెండింటినీ నిజం చేస్తూ ఆచార్య సినిమాను పూర్తి చేశారు ఆ ఇద్దరూ ! ఇక విడుదలే తరువాయి.అయితే ట్రిపుల్ ఆర్ కు చరణ్ ఏ విధంగా ప్లస్ అయ్యాడో అదేవిధంగా ఆచార్యకు ఓ వ్యక్తి అన్నీ తానై అండగా నిలిచారు. ఆ వ్యక్తి ఎవరు ఆ వివరం ఈ కథనంలో…
విడుదలకు సిద్ధం అవుతున్న ఆచార్య సినిమాకు సంబంధించి అనేక విశేషాలను మొన్నటి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పంచుకున్నారు దర్శక, నిర్మాతలు. ఈ సినిమా విషయమై నిర్మల్ ప్రాంతానికి చెందిన నిర్మాత నిరంజన్ రెడ్డికి మరో నిర్మాత సాయపడడం ఎంతో గొప్ప విషయం అని అంటున్నాయి సినిమా వర్గాలు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఒక్కటే కాదు సినిమా ప్రొడక్షన్ టైంలో కూడా ఎంతగానో సాయం చేశారని కొరటాల శివ అంటున్నారు.ఆయనే తారక్ తో త్వరలో సినిమాను నిర్మించనున్న సుధాకర్. ఈయన కొరటాలకు అత్యంత సన్నిహితులు.
బడ్జెట్ మరియు ఇతర విషయాల్లోనూ ముఖ్యంగా మార్కెటింగ్ ఫ్యాక్టర్స్ లోనూ కొరటాలకు అండగా నిలిచారు. వాస్తవానికి ఈ సినిమా కు వడ్డీలే అధికం అయ్యాయని కొరటాల శివ అంటున్నారు. తమ బృందం నాలుగేళ్లు పాటు ఎన్నో కష్టాలకు ఓర్చి, కరోనా విసిరిన సవాళ్లను అధిగమించి ఈ సినిమాను పూర్తి చేసిందని చెబుతున్నారు శివ. ఆ విధంగా ఇద్దరు పెద్ద పెద్ద స్టార్లు ఇంతవరకూ రెమ్యునరేషన్ విషయమై ఏ మాత్రం పట్టుబట్టకుండా చేసిన సినిమా ఇది అని కూడా చెబుతున్నారు శివ. ఈ విషయంలో నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా మెగాస్టార్ ను, మెగా పవర్ స్టార్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.