Acharya : ఆచార్య నుంచి వచ్చేసిన ‘సిద్ధ సాగా’.. ఇక మెగా ఫ్యాన్స్ కు పునాకాలే

-

మెగాస్టార్ చిరంజీవి చేసిన తాజా సినిమా ఆచార్య. ఈ ఆచార్య సినిమాకు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా .. మరో జంటగా రామ్ చరణ్ అలాగే పూజా హెగ్డే నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. ఈ సినిమాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే… పూర్తి కాగా విడుదలకు కూడా రెడీ అయింది. అలాగే ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్… మరియు పోస్టర్లు ఈ సినిమా పై అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో సిద్ధార్థ సాగా గా నటిస్తున్న రామ్ చరణ్ టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ టీజర్ లో…రామ్  చరణ్ చాలా పవర్ఫుల్ లుక్ లో కనిపించాడు. అమ్మోరు తల్లి ఆవహించింది అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ ఈ టీజర్ కే హైలెట్గా నిలిచింది. మొత్తానికి ఈ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news