కార్యకర్తలు ఏదో ఒక వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలి తప్ప ఏదో ప్రయోజనాన్ని ఆశించి, పార్టీపై ఆధారపడి బతకొద్దని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ కార్యకర్తలకు సూచించారు. ఆదివారం రోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు హితబోధ చేశారు. అలాగే ప్రతిపక్షాలు, చంద్రబాబు పైన విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వారికి ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు.
ధరల పెరుగుదలకు వైసీపీ ప్రభుత్వం కారణం కాదని, ఆ ప్రభావం దేశమంతా ఉందని పేర్కొన్నారు. ఏపీలో ఇప్పుడు విక్రయిస్తున్న మద్యం నాడు చంద్రబాబు ప్రవేశపెట్టిందే అని అన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇంటి స్థలం తో పాటు రూ 1.80 లక్షలు ఇస్తోందని, దానికి మరికొంత కలుపుకొని ఇల్లు కట్టుకోవలసిన బాధ్యత వారిదేనని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ సభను విజయవంతం చేయాలని, ఆయన పర్యటన విఫలమైతే ఆ బాధ్యత మనమే తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి ధర్మాన అన్నారు.