అంగ‌బ‌లం, అర్థ‌బ‌లంతో గోరంట్ల‌ను వైసీపీ నేత‌లు వెన‌కేసుకుని వ‌స్తున్నారు : పృథ్వీరాజ్

వైసీపీ ఎంపీ గోరంట్ల న్యూడ్‌ కాల్‌ వీడియో అంటూ వైరల్‌ అయిన విషయంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ప్రతిపక్ష నేతలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు. మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్లుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు, సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టిన వీడియోపై వైసీపీ మాజీ నేత‌, ప్ర‌ముఖ సినీ న‌టుడు పృథ్వీరాజ్ గురువారం స్పందించారు. అంగ‌బ‌లంతో పాటు అర్థ‌బ‌లం కూడా ఉండ‌టంతోనే గోరంట్ల‌ను వైసీపీ నేత‌లు వెన‌కేసుకుని వ‌స్తున్నార‌ని ఆరోపించారు పృథ్వీరాజ్. ఈ వీడియోపై గోరంట్ల మాధ‌వ్ స్పందించిన తీరు కూడా వైసీపీ నేత‌ల‌కు న‌చ్చిన‌ట్టుగా ఉంద‌ని కూడా వ్యాఖ్యానించారు పృథ్వీరాజ్. ఇంత‌టి దౌర్భాగ్యం ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌లేద‌ని అన్నారు పృథ్వీరాజ్.

Prudhvi resigns but blames corporate farmers

పార్ల‌మెంటులో తెలుగు ఎంపీల‌కు ఓ మంచి చ‌రిత్ర ఉంద‌న్న పృథ్వీ… అదంతా గోరంట్ల వీడియో కార‌ణంగా మొత్తం తుడిచిపెట్టుకుపోయింద‌న్నారు పృథ్వీరాజ్. గోరంట్ల వ్య‌వహారంలో వారం పాటు మీడియా స‌మావేశాలు పెట్టిన నేత‌లు ఇప్పుడు ఏమ‌య్యార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అనంత‌పురం ఎస్పీ చెబుతున్న విష‌యాలు ఒక‌దానితో మ‌రొక‌టి పొంత‌న లేకుండా ఉన్నాయ‌న్న పృథ్వీ… చివ‌ర‌కు ఆ వీడియో ఫేక్ అని తేల్చార‌ని మండిప‌డ్డారు. ఎవ‌రెన్ని చెప్పినా ప్ర‌జ‌లు ఆ మాత్రం అవ‌గాహ‌న చేసుకోకుండా ఉండ‌లేరా? అని వ్యాఖ్యానించారు పృథ్వీరాజ్.