వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రెండో విడత పాదయాత్ర మూడో వేవ్ కరోనా తగ్గిన తర్వాత ప్రారంభించింది వైఎస్ షర్మిల. ఇప్పటికే 700 కిలో మీటర్లు నడిచింది షర్మిల. ఈ నేపథ్యంలోనే… వైఎస్ షర్మిల పాదయాత్రలో ఒక్క సారిగా సినీ నటుడు శివారెడ్డి ప్రత్యక్ష మయ్యాడు.
ఇల్లందు నియోజక వర్గం టేకులపల్లి మండలం లో వైఎస్ షర్మిల గారి ప్రజా ప్రస్థానం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే.. వైఎస్ షర్మిలతో పాదయాత్ర లో పాల్గొంది సినీ కామెడీ నటుడు శివా రెడ్డి కుటుంబం. అంతేకాదు… ఈ సందర్భంగా వైఎస్ లా మిమిక్రీ చేసి అలరించాడు శివా రెడ్డి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక అంతకు ముందు సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకులపై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. TRS లీడర్లు…తాలిబన్లు..అచ్చం అలాగే ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులు కాళ్ళవెళ్ళా పడినా పోడు భూములు గుంజుకుంటున్నరు. తాలిబన్లు ఎలా ప్రవర్తిస్తారో నేడు TRS లీడర్లు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని విమర్శించారు షర్మిల.