డ్రగ్స్ ఆరోపణలతో భయపడి రాత్రులు నిద్ర సైతం పోయేవాడిని కాదు.. యాక్టర్ సుబ్బ రాజు..

-

విభిన్నమైన పాత్రలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుబ్బరాజు.. ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో నటించిన ఈయన పెళ్లి మాత్రం చేసుకోలేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు..కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో సుబ్బరాజు ఒకరు. ప్రతి నాయకుడు, సహాయక పాత్రలు, కామెడీ పాత్రలు ఇలా ఏ క్యారెక్టర్ అయినా ఇట్టే ఒదిగిపోయే నటుడు సుబ్బరాజు.. ఇప్పటివరకు దాదాపు 50 చిత్రాల్లో నటించిన ఈయన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శ్రీ ఆంజనేయం, ఖడ్గం, ఆర్య, నేనున్నాను, ఘర్షణ, షాక్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నారు..


తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించారు. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన సుబ్బరాజు పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.”మా న్నాన్న ఓ టీచర్. అందుకే చిన్నప్పటి నుంచి భయం ఉండేది. నేను ఏ తప్పు చేసినా అందరూ ఇంటికి వచ్చి మరీ చెప్పేసేవారు. దీంతో నేను బుద్ధిగానే ఉండాల్సి వచ్చింది. అలా ఓ వయసు వచ్చాక చూసి ఆరాధించడం తప్ప డీప్ లవ్​లు ఏం లేవు.. పెళ్లి ఎప్పుడూ కావాలని చేసుకోకూడదు, ఆ అవసరం వచ్చినపుడు చేసుకోవాలి. ఇప్పటివరకు పెళ్లితో నాకు అవసరం రాలేదు. వచ్చినపుడు కచ్చితంగా చేసుకుంటాను.. నాపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను నా తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందారు నా తప్పు లేకపోయినా వాళ్లను ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని నిద్ర కూడా పోయేవాడిని కాదు.. అంటూ చెప్పుకొచ్చారు..

Read more RELATED
Recommended to you

Latest news