పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ..

-

టాలీవుడ్ నటి పూర్ణ సోమవారం రాత్రి దుబాయ్ లో ప్రైవేట్ ఆస్పత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకోగా ఈమెకు శుభాకాంక్షలు వెలువెత్తాయి.హీరోయిన్ పూర్ణ గత ఏడాది జూన్లో దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త శానిద్ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. పెళ్లి జరిగిన కొన్ని రోజులకే తన తల్లి కాబోతున్నట్టు ప్రకటించారు పూర్ణ. ఈ నేపథ్యంలో తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ వస్తున్న ఈ హీరోయిన్ తన బేబీ బంప్ ఫోటోలు సైతం ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.

Actress Poorna : మగ బిడ్డకి జన్మనిచ్చిన నటి పూర్ణ.. - 10TV Telugu

అయితే తాజాగా దుబాయ్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఈమె వీటికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టా వేదికగా పంచుకున్నారు డాక్టర్లు నర్సులతో కలిసి ఉన్న ఫోటోలు పంచుకున్న పూర్ణ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఈమెకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా హీరోయిన్ పూర్ణ శ్రీ మహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అల్లరి నరేష్ తో జంటగా నటించిన సీమటపాకాయ్ చిత్రం మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది. ఆ తర్వాత అవును, రాజుగారు గది, దృశ్యం 2, అఖండ లాంటి సినిమాలతో అవకాశాలు అందుకుంది. డాన్ షోలకు సైతం జడ్జిగా వ్యవహరించిన పూర్ణ పెళ్లి అనంతరం కూడా సినిమాల్ని కొనసాగిస్తూ వస్తున్నారు తాజాగా నాని కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా చిత్రంలో సైతం కీలక పాత్ర పోషించారు పూర్ణ.

Read more RELATED
Recommended to you

Latest news