నటి సుహాసినిపై తమిళ యువత ఆగ్రహం… హిందీ మంచి భాష అన్నందుకు ట్రోల్స్

-

హిందీ వివాదంపై నటి సుహాసిని స్పందించారు. మేము అన్ని భాషలు నేర్చుకోవాలని… హిందీ మంచి భాష అని, ముఖ్యంగా హిందీ భాషను నేర్చుకోవాలని ఆమె అన్నారు. హిందీ మాట్లాడే వాళ్లు మంచి వాళ్లు అని.. వాళ్లతో మాట్లాడుతుంటే మనం హిందీ నేర్చుకోవాలని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తమిళ వాళ్లు కూడా మంచి వాళ్లని.. తమిళంలో మాట్లాడితే సంతోషం అంటూ వ్యాఖ్యానించారు. మా ఇంట్లో ఉదయం పనిచేసేవారు తెలుగులో మాట్లాడుతారని.. రాత్రి పనిచేసే అతను హిందీలో మాట్లాడుతాడని ఆమె అన్నారు. నాకు అన్ని భాషలు కావాలని.. ఈ భాషే కావాలంటే నాకు తిండి దొరకడు కదా.. అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అందరూ అన్ని భాషలను నేర్చుకోవాలని అన్నారు.

అయితే అసలే భాషాభిమానం ఎక్కువగా ఉండే తమిళనాడులో సుహాసిని వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆమె వ్యాఖ్యలపై తమిళ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా సుహాసినిని ట్రోల్ చేస్తున్నారు. హిందీ మంచి భాష అయితే అలాంటప్పుడు హిందీ సినిమాలే చేసుకుంటూ.. అక్కడే ఉండాల్సిందంటూ సెటైర్లు వేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news