వావ్‌.. 10వేల ఆదిపురుష్ సినిమా టికెట్లను ఫ్రీ

-

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ శ్రీరాముని పాత్ర పోషిస్తున్న సినిమా ఆదిపురుష్‌. ఈ సినిమా ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. అయితే.. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను ఫ్రీగా చూసేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాధాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు పదివేల ప్లస్ టికెట్లను ఉచితంగా ఇస్తామని ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు.

Adipurush new poster out: Makers post lyrical motion poster featuring  Prabhas as Lord Ram on Akshaya Tritiya (WATCH)

దీనికోసం గూగుల్ ఫామ్ నింపితే టికెట్లు నేరుగా మేము పంపిస్తామని అభిషేక్ అగర్వాల్ వెల్లడించారు. ” శ్రీరాముని ప్రతి అధ్యాయం మానవాళికి ఒక పాఠం, ఈ తరం ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన అడుగుజాడలను అనుసనరించాలి… జై శ్రీరామ్ కీర్తనలు నలువైపులా ప్రతిధ్వనించాలి” అని ఆయన ట్వీట్ చేశారు.

రామయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రం భారీ అంచనాల నడుమ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందులో కృతిసనన్ సీతగా నటించింది. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.

Read more RELATED
Recommended to you

Latest news