అఫ్గానిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. సౌత్ ఆఫ్రికా టి20 లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టుకు సారథ్యం వహిస్తున్న ఇతను, జనవరి 23న ప్రిటోరియ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ ల్లో మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా టీ 20 ఫార్మాట్ లో 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న రెండో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.
24 ఏళ్ల రషీద్ ఖాన్, ఈ ఫీట్ ను 371 టీ 20 మ్యాచ్ ల్లో సాధించాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు విండీస్ వెటరన్ ఆల్ రౌండర్ బ్రావో పేరిట ఉంది. బ్రావో 500 వికెట్ల మైలురాయని చేరుకునేందుకు రూ.458 మ్యాచులు ఆడాడు. ప్రస్తుతం ఈ విండీస్ వీరుడి ఖాతాలో 641 వికెట్లు ఉన్నాయి.