కవితని వదలని ఈడీ..జైలు రెడీ అవుతోందా?

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితని ఈడీ వదిలేలా లేదు..ఇప్పటికే ఒకసారి విచారణ చేసిన విషయం తెలిసిందే. మార్చి 11న విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అప్పుడు 8 గంటల పాటు విచారణ జరిగింది. ఈ క్రమంలోనే మళ్ళీ 16న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. కానీ ఈడీ విచారణకు పిలవకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత సుప్రీం కోర్టుకు వెళ్లింది. కానీ ఆ పిటిషన్ కోర్టు తిరస్కరించింది..అలాగే తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది.

అయితే కోర్టు తుదితీర్పు వచ్చేవరకు విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీకి విన్నవించారు. కానీ ఈడీ ఏ మాత్రం కవిత విన్నతిని పట్టించుకోలేదు. ఈ నెల 20న విచారణకు హాజరు కావాల్సిందే అని నోటీసులు ఇచ్చింది. అలాగే తనని తన ఇంటి వద్ద విచారణ చేయాలని కవిత కోరింది…అయినా కవిత విన్నతిని ఈడీ పట్టించుకోలేదు. ఢిల్లీలోనే విచారణకు హాజరు కావాలని కోరింది.

కేసీఆర్ బిడ్డకు జైలు రెడీ అవుతోందని అని బండి సంజయ్ అన్నారు. ప్రతిదానికి బండి సంజయ్‌ను బద్నాం చేయటం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని, బీఆర్ఎస్‌కు కేసీఆర్ కుటుంబానికి ఒక రూల్.. ఇతరులకు మరొక రూలా అని ప్రశ్నించారు. కూతురుని కాపాడుకోవటానికి సీఎం కేసీఆర్ నానా పాట్లు పడుతున్నారని అన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం రాఘవరెడ్డి తీహార్‌ జైలులో ఉన్నారు. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఎంపీ మాగుంటకు కూడా తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news