ఫోన్ ట్యాపింగ్ శ్రవణ్ రావుకు పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈనెల 8వ తేదీన మళ్లీ తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. శ్రవణ్ రావు పోలీసుల విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా శ్రవణ్ రావు తప్పించుకుంటున్నారు. 2023లో జరిగిన ఎన్నికల సందర్భంగా వాడిన సెల్ ఫోన్లు కావాలని సిట్ కోరిది. రెండు సెల్ ఫోన్లు ఇవ్వాలని అడిగితే ఒకటే ఇచ్చి శ్రవణ్ రావు తప్పించుకున్నారు.
శ్రవణ్ రావు పాత తప్పు పట్టిన సెల్ ఫోన్ ని పోలీసులకు ఇచ్చారు. శ్రవణ్ రావు ఇచ్చిన సెల్ ఫోన్ చూసి షాక్ కి గురయ్యారు పోలీసులు. ఈ నేపథ్యంలో మేము అడిగిన రెండు సెల్ ఫోన్లు తీసుకొని 8వ తేదీన హాజరు కావాలని శ్రవణ్ రావుకి నోటీసులు జారీ చేశారు. మొదటిసారి విచారణలో ఎలాంటి సమాధానాలు చెప్పలేదు. ఇవాళ జరిగిన విచారణలో పాత తుప్పు పట్టిన సెల్ ఫోన్ ఇచ్చి ఏమి తెలియదని చెప్పారు.