ఆహా ! ఏపీ పోలీస్..జ‌గ‌న్ కోసం వారేం చేశారంటే?

-

మామూలుగా కాదు చాలా ఎక్కువ‌గానే ఆలోచించి పోలీసులు కొన్ని ప‌నులు చేస్తుంటారు. ఆ విధంగా  పాపం కొన్ని సార్లు వివాదాల‌కు కేంద్ర బిందువు అవుతుంటారు. ఇందులో నాయ‌కుల ప్ర‌మేయం క‌న్నా వీరి అతి కార‌ణంగానే  ప్ర‌భుత్వాల‌కు చెడ్డ పేరు వ‌స్తుంది. వాస్త‌వానికి ఇప్ప‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారులో జ‌గ‌న్ చెప్పిన‌వి చేయ‌డం క‌న్నా ఆయ‌న చెప్ప‌నివి చేసేందుకు, ఆ విధంగా అత్యుత్సాహం చూపేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఆ విధంగా అతి స్వామి భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా అటు సాధార‌ణ పోలీసులు ఇటు సంబంధిత ఉన్న‌తాధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు వివాదాల్లో ఉంటూనే వ‌స్తున్నారు. తీరా అంతా అయ్యాక మీడియాలో వెలుగు చూశాక అయ్యో! మేం అలా చేయం అండి.. మా దృష్టికి ఆ విష‌య‌మే రాలేదండి అని క‌ప్ప‌దాటు జ‌వాబులు మాత్రం ఇచ్చి త‌ప్పుకుంటారు. కానీ త‌ప్పును మాత్రం ఒప్పుకోరు గాక ఒప్పుకోరు. ఒంగోలులో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది.

వినుకొండ నుంచి తిరుమ‌ల‌కు బ‌య‌లు దేరిన ఓ కుటుంబం ఒంగోలు ద‌గ్గ‌ర ఆగింది. ఈ నెల 22న ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు డ్రైవ‌ర్ తో స‌హా వాహ‌నం కావాలంటూ కాన్వాయ్ కు సంబంధించి మీ వాహ‌నం వాడుకుంటామంటూ ప‌ట్టుకు వెళ్లిపోయారు. ఆ విధంగా ఆ కానిస్టేబుల్ సింపుల్ గా ఓ సారీ చెప్పి వెళ్లిపోయాడు..డ్రైవ‌ర్ వెళ్లిపోయాడు. వాళ్ల వాహ‌నం కూడా వెళ్లిపోయింది. కుటుంబం మొత్తం రోడ్డున నిలబ‌డిపోయింది. ఈ విష‌యంలో ఎవ‌రిని నిందించాలి.. ఎందుకీ స్వామి భ‌క్తి.. ఆఖ‌రికి ఆ కుటుంబం ఇప్పుడు ఎలా త‌మ స్వ‌స్థ‌లం వినుకొండ‌కు చేరుకోవాలో అర్థం కాక న‌డి రోడ్డున ఉండిపోయింది. దీంతో వారి స‌మ‌స్య  ఇప్పుడు అప‌రిష్కృతంగానే ఉంది. కేవ‌లం టిఫిన్ కోసం ఆగినందుకు త‌మను ఈ విధంగా ఇబ్బందుల‌కు గురి చేయ‌డం భావ్యం కాద‌ని
సంబంధిత కుటుంబం ఆవేద‌న చెందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news