బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… “అఖండ” సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్

నందమూరి బాలయ్య నటించిన సినిమా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అఖండ సినిమా విజయంతో చిత్రపరిశ్రమకు… చాలా రోజుల తర్వాత మళ్లీ ఊపు వచ్చింది. డిసెంబర్ 2వ తేదీన విడుదలైన అనకొండ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేలా రికార్డులను బద్దలు కొడుతుంది. అయితే… ఈ అఖండ సినిమా ఎప్పుడు ఓటీటీలో ప్రసారం అవుతుందోనని చాలా మంది ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే.. అఖండ తెలుగు చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ను హాట్‌ స్టార్‌ అధికారికంగా ప్రకటించింది. 2022 జనవరి 21 వ తేదీన ప్రీమియర్‌ లో స్ట్రీమ్‌ కానుందని చెప్పింది హాట్‌ స్టార్‌. జనవరి 21 వ తేదీన సాయంత్రం 6 గంటలకు హాట్‌ స్టార్‌ విడుదల కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది హాట్‌ స్టార్‌. దీంతో బాలయ్య ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా అటు థియేటర్లలో అఖండ మూవీ జాతర కొనసాగుతున్న సంగతి తెలిసిందే.