ఓటీటీలోకి వచ్చేస్తున్న అయ్యగారి ‘ఏజెంట్‌’..

-

అఖిల్ హీరోగా రూపొందిన ‘ఏజెంట్’ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా రిలీజ్ కానుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తూ వస్తోంది. అయితే ఓటీటీలో ఈ సినిమా కోసం వెయిట్ చేసే ఆడియన్స్ కి ఎప్పటికప్పుడు నిరాశ ఎదురవుతూ వచ్చింది. కానీ తాజాగా మాత్రం ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన వచ్చేసింది.

Agent: Akhil Akkineni promises action like never before in the new birthday  poster ahead of the grand release | PINKVILLA

ఏజెంట్ సినిమాలో అఖిల్ హీరోగా చేయగా.. మలయాళ స్టార్ నటుడు మమ్మూటి కీలకపాత్ర పోషించారు. ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్‍గా చేశారు. డినో మోరియా, విక్రమ్‍జీత్, డెంజిల్ స్మిత్ కీలకపాత్రల్లో కనిపించారు. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందింది. ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టడడంలో విఫలమైంది. కొన్ని ఆర్థికపరమైన విషయాల వల్ల ఓటీటీ రిలీజ్ కూడా వాయిదా పడుతూ వచ్చింది. సోనీ లీవ్ ఈ సినిమా స్ట్రీమింగ్‍ను ఆలస్యం చేస్తూ వచ్చింది. దీంతో ఏజెంట్ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అందరూ ఎదురుచూశారు. ఇప్పుడు ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్ 29న ఏజెంట్ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news