మ‌ద్యం దొర‌క్క ఎర్రగడ్డకు పోటెత్తుతున్న మందుబాబులు.. మ‌రీ ఇంత దారుణంగానా..?

-

క‌రోనా వైర‌స్ ను క‌ట్ట‌డి చేయ‌డానికి ఎక్క‌డ‌క‌క్క‌డ లాక్‌డౌన్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో అత్యవసర సేవలు మినహా అన్నీ బందయ్యాయి. బార్లు, వైన్స్‌లు సైతం బంద్ కావడంతో మందుబాబులు విలవిలలాడిపోతున్నారు. చుక్క లేనిది నిద్ర పట్టని లిక్కర్ బాబులకు లాక్ డౌన్ చుక్కలు చూపిస్తుంది. కనీసం బ్లాకులో కొందామన్నా కూడా వారికి ఎక్కడా మ‌ద్యం దొరకడం లేదట. దీంతో ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చినట్టు అయింది మందుబాబుల ప‌రిస్థితి. ఏదో ఒక్కరోజు జనతా కర్ఫ్యూ అనుకోని ఎవ్వరూ కూడా మందు కొని నిల్వ చేసుకోలేదు.

కానీ ఆ జనతా కర్ఫ్యూను అమాంతం 14 పాటు లాక్‌డౌన్ చేయ‌డంతో మందుబాబుల భాద వ‌ర్ణ‌ణాతీతం. ఇక గ‌త రెండు వారాలు మ‌ధ్యం దొర‌క్క కొంద‌రు ఆత్మ‌హ‌త్య‌లు సైతం చేసుకుంటున్నారు. మ‌రి కొంద‌రు పిచ్చెక్కి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వీరి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇక తెలంగాణలో మద్యం దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోన్న వారిని హైదరాబాద్‌ ఎర్రగడ్డకు తరలిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఎర్రగడ్డలో 800కు పైగా కేసులు నమోదయ్యాయి అంటే మందుబాబుల ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది.

అదేవిధంగా, గత రోజుల్లో పోలిస్తే ఇలాంటి కేసులు 98 శాతం పెరిగాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇందులో వంద మంది ఆరోగ్యం నుంచి కుదుటపడి డిశ్చార్జ్‌ అయినట్లు అధికారులు తెలిపారు. మద్యానికి బానిసైనవారు ఒక్కసారిగా మద్యాన్ని ఆపితే 24 గంటల్లోనే ఆ ప్రభావం వారిపై చాలా ఎక్కువగా చూపిస్తుందని.. నిన్న ఒక్క రోజులోనే 200 మంది ఔట్‌ పేషంట్లు చికిత్స తీసుకున్నారని అక్క‌డ వైద్యులు వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news