ఎల్‌ఐసీ పాలసీదారులకు అలర్ట్… దీనికి మార్చి 25 వరకే గడువు..!

-

దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. చాలా రకాల పాలసీలను కూడా వారి కోసం తీసుకు వచ్చింది. పిల్లలుకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళలుకి ఇలా ప్రత్యేకంగా పాలసీలని అందిస్తోంది. ఎవరికి నచ్చిన పాలసీని వారు తీసుకోచ్చు.

LIC
LIC

ఎల్‌ఐసీ నుంచి పాలసీ తీసుకొని, ఆర్థిక ఇబ్బందులు వల్ల ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అవ్వచ్చు. అలా కనుక అయ్యిందంటే ఈ విధంగా చెయ్యచ్చు. పూర్తి వివరాల లోకి వెళితే.. ఇలాంటి పాలసీలు కలిగిన వారికి కూడా ఎల్‌ఐసీ ఇప్పుడు ఒక ఆప్షన్ అందిస్తోంది. మళ్లీ రెగ్యులర్ చేసుకునే వెసులుబాటు ఇస్తోంది.

మీరు కూడా ఇలాంటి పాలసీ కలిగి ఉంటే LIC ఇస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిది. మార్చి 25 వరకు గడువు అందిస్తోంది. ల్యాప్స్ అయిన పాలసీలను ఈ గడువులోగా మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. అందుకనే ల్యాప్స్ అయితే పునరుద్ధరించుకోవాలని భావిస్తే పాలసీదారులకు లేట్ ఫీజు మినహాయింపు కూడా లభిస్తుంది.

దీనికి మార్చి 25 వరకు గడువు ఉంది. ఎల్‌ఐసీ ఫిబ్రవరి నెల నుంచే ఈ అవకాశాన్ని ఇస్తోంది. వార్షిక ప్రీమియం రూ. లక్ష వరకు చెల్లించాల్సి ఉంటే వారికి 20 శాతం వరకు డిస్కౌంట్ లేదా గరిష్టంగా రూ. 2 వేల వరకు ప్రయోజనం ఉంటుంది. రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు వార్షిక ప్రీమియం ఉంటే వారికి 25 శాతం వరకు డిస్కౌంట్ లేదా గరిష్టంగా రూ. 2,500 తగ్గింపు ఉంటుంది. రూ. 3 లక్షలకు పైన వార్షిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటే వారికి 30 శాతం వరకు లేదా గరిష్టంగా రూ. 3 వేల వరకు తగ్గింపు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news