ఆ రైతులకి అలర్ట్.. కేంద్రం కీలక మార్పులు…!

-

కేంద్రం రైతుల కోసం ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా స్కీమ్ ని కేంద్రం తీసుకు వచ్చింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన తో చాలా ప్రయోజనాలని పొందొచ్చు. రైతుల పంటలకు బీమా సౌకర్యంను ఈ స్కీమ్ ద్వారా ఇస్తోంది. వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులకి ఈ పథకం కింద పరిహారాన్ని ఇస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ పథకంలో భారీగా మార్పులు చేయాలని చూస్తోంది కేంద్రం. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఒరిస్సా, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాల వలన పంటలు దెబ్బ తిన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ మొదలైన చోట్ల కూడా వర్షాలు ఎక్కువ పడ్డాయి. దీని వలన పంటలు బాగా దెబ్బతిన్నాయి. వాతావరణ సంక్షోభం, వాతావరణ మార్పులని చూసి ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో మార్పులు చేయాలని చూస్తోంది.

వాతావరణ సంక్షోభం, సాంకేతికతకు అనుగుణంగా ప్రభుత్వం ఈ మార్పులు చేస్తోంది. పంటల వలన దెబ్బతిన్న ప్రతీ రైతుకు ఈ ఫెసిలిటీ ని కల్పించనుంది. దీని కోసం రైతులు ముందుగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఖరీఫ్ పంట కోసం బీమా మొత్తంలో 2% వరకు ప్రీమియం ని చెల్లించాలి. అలానే రబీ పంటకు 1.5 శాతం వరకు ప్రీమియం చెల్లించాలి. వాణిజ్య, ఉద్యాన పంటలకు అయితే ప్రీమియంలో గరిష్టంగా 5 శాతం చెల్లించాలి.

ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవడం కోసం మీరు బ్యాంక్ బ్రాంచ్‌ కోఆపరేటివ్ బ్యాంక్, పబ్లిక్ సర్వీస్ సెంటర్ కి వెళ్ళచ్చు. లేదంటే ఆథరైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీల వద్దకు అయినా సరే వెళ్ళచ్చు. https://pmfby.gov.in/ వెబ్ సైట్ ద్వారా కూడా రిజిస్టర్ చెయ్యచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news