సినీ నటుడు అలీ.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశం కానున్నారు. ఈ మేరకు అలీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎంతో సమావేశం కానున్నారు అలీ. అలీకి రాజ్యసభ స్థానం ఇస్తారనే ప్రచారంలో ఈభేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. త్వరలో ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో ఒకటి మైనారిటీలకు సీఎం జగన్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది.
గతవారం సినీ ప్రముఖులు ఏపీ సీఎంతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణ మూర్తి, పోసాని, అలీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంలో అలీకి త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని సీఎం అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. వారం తరువాత భేటీ అవుదాం అని అలీతో సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దీంతో ఈరోజు భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే తాజాగా ఈరోజు మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా భేటీ అయ్యారు.