‘అలిపిరికి అల్లంత దూరంలో”..అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా

-

 

 

 

యువ నటుడు రావణ్ నిట్టూరు కథానాయకుడిగా కాస్కేడ్ పిక్చర్స్ బ్యానర్ పై రమేష్ డబ్బు గోట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మించిన చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’ ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ

తిరుపతిలో ఉండే మిడిల్ క్లాస్ అబ్బాయి వారది (రావణ్ నిట్టూరు) కు ఫైనాన్సియల్ గా ఎన్నో ప్రొబ్లెమ్స్ ఉన్నందున చిన్న చిన్న మోసాలు చేస్తూ వెంకటేశ్వర స్వామి పటాలు అమ్మే షాప్ రెంట్ కు తీసుకొని మెయింటైన్ చేస్తుంటాడు. అక్కడే వెంకటేశ్వర గోశాలలో వాలెంటరీగా పని చేసే ధనవంతుల కుమార్తె కీర్తి ( శ్రీ నికిత) ను చూసి ప్రేమిస్తాడు. ఇద్దరూ లవ్ చేసుకున్న విషయం తెలుసుకున్న కీర్తి తండ్రి వారది షాప్ కు వచ్చి నీకు చదువు లేకపోయినా , డబ్భైనా ఉంటే నా కూతురిని ఇచ్చే వాడిని నీకు డబ్బు లేదు, నా కూతురి జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చి వెళతాడు. దాంతో బాగా డబ్బు సంపాదించి కీర్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. ఇలాంటి ఫైనాన్సియల్ క్రైసస్ లో ఉన్న వారది కి వెంకటేశ్వర స్వామికి 2 కోట్ల ముడుపుల మొక్కు చెల్లించుకోవడానికి వచ్చిన యాత్రికుడి కుటుంబం గురించి తెలుసుకొని ఆ రెండు కోట్లు కొట్టేస్తే తిరుమల లో షాప్ పెట్టుకొని, కీర్తిని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు అనుకుంటాడు.ఆ రెండు కోట్లను దొంగతనం చెయ్యాలని ప్లాన్ చేసుకున్న తరువాత తను అనుకోకుండా చాలా విషయాల్లో ఇరుక్కొని ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాటినుండి వారధి ఎలా ఎదుర్కొన్నాడు, ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి ? వీటన్నిటినీ వెంకటేశ్వర స్వామి ఎలా గేమ్ ప్లాన్ చేశాడు, అలాగే యాత్రికుడు మొక్కుకున్న ముడుపులు మొక్కు చెల్లించు కున్నాడా లేదా ? చివరకు వారధి తిరుమలలో షాప్ ను సొంతం చేసుకుని కీర్తిని పెళ్లి చేసుకోవాలనే కలను నెరవేర్చుకొన్నాడా లేదా? అనేది తెలుసుకోవాలంటే ‘అలిపిరికి అల్లంత దూరంలో’ సినిమా చూడాల్సిందే

నటీ నటుల పనితీరు

వారధి పాత్రలో రావణ్ నిట్టూరు కిది తొలి చిత్రమైనా చాలా న్యాచురల్ గా చాలా చక్కగా నటించాడు.కీర్తి పాత్రలో శ్రీ నికిత ఉన్నంతలో చక్కటి పెర్ఫార్మన్స్ చూపించింది.హోటల్ బిజినెస్ మ్యాన్ గా బొమ్మకంటి రవీందర్ , ముడుపులు మొక్కు కచ్చితంగా తీర్చుకోవాలి అని పట్టుబట్టిన పాత్రలో నటించిన అమృత వర్షిణి సోమిశెట్టి , హీరోయిన్ కీర్తి తల్లి తండ్రులు గా జయచంద్ర, తులసి లు, వారధి తల్లి పాత్రలో లహరి గుడివాడ నటించి అందరినీ మెప్పించింది. ఒక వ్యక్తి దగ్గర డబ్బుని దొంగలించిన కారణంగా తను చేసిన తప్పులకు పక్ష పాతం వచ్చి మంచానికే పరిమితమైన హీరో తండ్రిగా వేణుగోపాల్, హరిదాసు పాత్రలో శతావధాని మురళి, హీరో ఫ్రెండ్ గా యం. యస్ ఇలా అందరూ చాలా అనుభవం వారిలా పోటీ పడి నటించడమే కాకుండా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

ప్లస్ పాయింట్స్

ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయినా రావణ్ నిట్టూరు పాత్ర, ఆ పాత్రకి సంబంధించిన ఎమోషనల్ ట్రాక్, అలాగే ఆ పాత్రతో ముడిపడిన మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ‘అలిపిరికి అల్లంత దూరంలో’ సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకుంది. ముఖ్యంగా కామెడీ టోన్ తో సాగే రాబరీ సీన్ అండ్ మిగిలిన సీక్వెన్స్ లు అండ్ ఎమోషన్స్ వంటివి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన రావణ్ నిట్టూరు తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియల్ లిస్టుకి యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలైట్ గా నిలిచాడు.

 

అలాగే, హీరోయిన్ పాత్రలో నటించిన శ్రీ నికిత కూడా చాలా బాగా నటించింది. ఆమె హవా భావాలు కూడా బాగానే అలరించాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సస్పెన్స్ ఎమోషనల్ రాబరీ గ్రామాల్లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు ఆనంద్ బాగా తీశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రివిల్ అయ్యే కంటెంట్ తో బాగా ఆకట్టుకున్నాడు.

రేటింగ్ 3/5

Read more RELATED
Recommended to you

Latest news