మునుగోడు లో బిజెపి ఓడినా దాని ప్రమాదం ఇంకా పొంచివుంది – తమ్మినేని

-

పోడు భూముల పై సర్వే జరిగింది …వచ్చే నెలలో పట్టాల పంపిణి మంచి నిర్ణయమేనన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కానీ.. సర్వేల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయన్నారు. 50 సంవత్సరాలు గా సాగు చేసుకున్న భూములపై రెండు సంవత్సరాల క్రితం అటవీ అధికారులు హరితహారం కార్యక్రమం చేపట్టారని.. వారికి కూడా పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులు , యూనియన్లు పై నిర్ణయం తీసుకోవాలన్నారు తమ్మినేని. 1998,2008 లో Dsc సెలెక్ట్ అయిన అభ్యర్థులను పెండింగ్ లో పెట్టారని .. మానవతా దృక్పథంతో సమస్య పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మునుగోడు లో బీజేపీ ఓడినా.. టీఆరెస్ పని అయిపోయిందని బీజేపీ ప్రచారం చేసిందన్నారు.

రామగుండం పర్యటన కూడా అలాంటిదేనన్నారు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో అవినీతి జరుగుతున్నా అక్కడ ఈడీ లు ఎం చేస్తున్నాయని ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలో ధరణి సమస్యలు పరిష్కరించాలన్నారు. మునుగోడు లో బీజేపీ ఓడినా దాని ప్రమాదం ఇంకా పొంచి ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news