శివసేన లో సీఎం థాక్రే తర్వాత నెంబర్ 2 గా ఉన్న ఎంపీ, పార్టీ పత్రిక సామ్నా ఎడిటర్ సంజయ్ రౌత్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడి) మరోసారి నోటీసులు పంపింది. ప్రస్తుతం ఉద్దవ్ థాక్రే క్యాంపు లో కీలక నేతగా ఉన్న సంజయ్ రౌత్ ను రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది ఈడీ. వేల కోట్ల విలువైన పత్రా చాల్ భూకుంభకోణం కేసులో భాగంగా కేంద్ర సంస్థ ఈడీ నోటీసులు జారీ చేసింది.
కాగా సంజయ్ రౌత్ మాత్రం నాకు ఇప్పటివరకు ఈడీ నోటీసులు అందలేదని తెలియజేశారు. ఈ విషయంపై నోటీసులు చూసిన తర్వాత మాట్లాడతాను అని తెలిపారు. అయినా కూడా రేపు తనకి వేరే పనులు ఉన్నాయ్ అని అన్నారు. కాగా కేంద్ర సంస్థలను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని, ఈడీ, సిబిఐ లాంటి సంస్థలను ప్రత్యర్థులపై ప్రతీకారానికి వాడుతూ ఉందని విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి.