ప్రపంచ దేశాలన్నీటిని కరోనా అనే మహమ్మారి పట్టి పీడిస్తుంది. అగ్రరాజ్యాలు సైతం దీని ధాటికి విలవిలలాడిపోతున్నాయి. మాస్క్, సానిటైజర్ లేనిదే ప్రజలు అడుగు బయట పెట్టలేక పోతున్నారు. దీంతో వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అంటూ అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లక్షల మంది దీని బారిన పడి మరణించారు. శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఎంతో తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ దీనికి మందు మాత్రం కనుక్కొలేకపోతున్నారు. అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది శాస్త్రవేత్తలు ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో తీవ్రంగా కృషి చేస్తున్నారు.
అయితే కరోనా పుట్టినిళ్ళైన చైనాలో వైరస్ ఇప్పటికే దాదాపు కట్టడిలోకి వచ్చింది. దీంతో తమ దేశంలో ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం లేదనే యోచనలో చైనా ఉంది. కరోనాతో పోరాడుతున్న వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయిస్తే సరిపోతుందని చైనా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ డైరెక్టర్ మీడియాతో వెల్లడించారు.