ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం ఖరారు అయింది. మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు. ఏపీ కేబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎం లు మరోసారి ఉండనున్నారు. ఇందులో దళిత మహిళకు హోంశాఖ కేటాయించారు. అయితే ఈ సారి కేబినెట్ లో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన రోజా మరియు విడదల రజిని కీలక పదవులు దక్కాయి. నగరి ఎమ్మెల్యే రోజా కు పర్యాటకశాఖ ఇచ్చిన సీఎం జగన్…. రజినీకి వైద్యఆరోగ్యశాఖ లు అప్పగించారు.
ఇక మిగతా శాఖలను పరిశీలిస్తే..
మంత్రులు వారి శాఖలు..
ధర్మాన ప్రసాదరావు- రెవెన్యూ , రిజిస్ట్రేషన్ల శాఖ
బొత్స సత్యనారాయణ- విద్యాశాఖ
సిదిరి అప్పలరాజు- మత్స్య , పశుసంవర్ధక శాఖ
రాజన్న దొర- గిరిజన శాఖ
గుడివాడ అమర్నాథ్- పరిశ్రమల శాఖ
ముత్యాల నాయుడు- పంచాయతీరాజ్ శాఖ
దాడిశెట్టి రాజు- రోడ్లు భవనాల శాఖ
తానేటి వనిత- హోం శాఖ
కారుమూరి నాగేశ్వరరావు- పౌరసరఫరాలు, వినియోగ దారుల శాఖ
కొట్టు సత్యనారాయణ- దేవాదాయ శాఖ
జోగి రమేష్ – గృహ నిర్మాణ శాఖ.
నూతనంగా ప్రమాణం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు. #APNewMinisters #CMYSJagan pic.twitter.com/USKxF4qnMm
— YSR Congress Party (@YSRCParty) April 11, 2022