దేశవాళీ ఆవుల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను కోరిన అల్లోల దివ్యారెడ్డి

-

దేశవాళీ అవుల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను కోరారు సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్, క్లిమామ్ వ్య‌వ‌స్థాప‌కురాలు అల్లోల దివ్యారెడ్డి.. “కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్‌ దేశవాళీ అవులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, కృత్రిమ గర్భధారణ పద్దతుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను , సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్, క్లిమామ్ వ్య‌వ‌స్థాప‌కురాలు అల్లోల దివ్యారెడ్డి కోరారు. సేవ్ దేశి కౌస్ ప్రచారంలో (save desi cows campaign) భాగంగా మంగళవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు ఆమె గోమయ గణపతి ప్రతిమను అందజేశారు. అనంతరం దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేపట్టిన ప్రచార కార్యక్రమాలను వివరించారు.విదేశాలకు చెందిన జెర్సీ, హాలిస్టిన్ వంటి హైబ్రిడ్ జాతులతో
కృత్రిమ గర్భధారణ వల్ల మన దేశీ ఆవు జాతులు ఎన్నో అంతరించి పోతున్నాయని, కాలక్రమేణా మన దేశవాళీ ఆవులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వివరించారు.

మన దేశ మేలు రకమైన ఆవులను అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు పెంచి పోషిస్తే… మనం మాత్రం అధిక పాల దిగుబడి కోసం హైబ్రిడ్ జాతుల పోషణకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నాసిరకం పాలు మన పిల్లలకు ఇస్తున్నామని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి క్రాస్ బ్రీడింగ్ పద్దతిని అరికట్టాలని, స్వదేశీ జాతుల అభివృద్ధికి కృషి చేయాలని అభ్యర్థించారు.

క్రాస్ బ్రీడింగ్ వ‌ల్ల దేశీ ఆవుల ఉనికే ప్ర‌మాదంలో పడిందని, క్రాస్ బ్రీడింగ్ పద్దతుల నివారణకు తగు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ… తాను సుప్రీం కోర్టులో మే నెలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశానని, ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీస్ లు జారీ చేసిందని సీఎం కు వివరించారు.దీనిపై సానుకూలంగా స్పందించిన … దేశవాళీ అవుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సీఎం చెప్పారని… అల్లోల దివ్యా రెడ్డి తెలిపారు.

అనంతరం సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు దివ్యా రెడ్డి.దేశీ జాతి ఆవులను సంరక్షించాల‌నే లక్ష్యంతో సేవ్ దేశి కౌస్ ప్రచారం చేపట్టామని… దీనికి మద్దతు నివ్వాలని భారతిని కోరారు.తెలుగు రాష్ట్ర‌ల్లోని ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా చిన్న‌పిల్ల‌ల‌కు స్వ‌చ్చ‌మైన ఏ2 మిల్క్ ను అందించాల‌నే ఉద్దేశంతో పాటు హైబ్రిడ్ జాతులతో క్రాస్ బ్రీడింగ్ పద్ధతుల వల్ల దేశీయ పశుసంపద కనుమరుగైపోకుండా, వాటిని పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు ఈ సంపాదనను అందించాల్సిన కర్తవ్యంతో ప‌ని చేస్తున్న‌ట్లు ఆమెకు వివరించారు.దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం దివ్యా రెడ్డి చేస్తున్న కృషిని వైఎస్ భారతి అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news