Mega 154లో రవితేజతో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు !

-

ఆచార్య సినిమా తర్వాత మెగా స్టార్‌ చిరంజీవి.. తన ఫ్యాన్స్‌ కోసం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి… మూడు సినిమాలను లైన్‌ లో పెట్టారు. అందులో ఒకటే మెగాస్టార్ 154 సినిమా. ఆ సినిమాకు వాల్తేరు వీరయ్య టైటిల్‌ పెట్టనున్నట్లు టాక్‌. ఇక ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాకు టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఇక ఈ సినిమా మాస్‌ మహారాజు రవితేజ కూడా నటిస్తున్నారు. అయితే.. తాజాగా సమాచారం ప్రకారం.. వెంకీ, నాగ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. అయితే.. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఒక వేళ ఈ వార్త నిజమే అయితే.. ఫ్యాన్స్‌ కు పండగే అని చెబుతున్నారు టాలీవుడ్‌ ప్రముఖులు.

 

Read more RELATED
Recommended to you

Latest news