అమరావతి ప్రజలను మరోసారి బ్రమల్లో ముంచుతున్నారా ?

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఆరేళ్లైంది. తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతోంది. ఏపీ రాజధాని విషయంలో మాత్రం ఇంతవరకూ స్పష్టత లేదు. రాజధాని అమరావతిలో ఉంటుందా.. విశాఖ తరలుతుందా అనే విషయంలో ప్రజల్లో అయోమయం నెలకొంది. ఇక పెట్టుబడిదారుల్లో కూడా రాజధానిపై చాలా ప్రశ్నలున్నాయి. ఇంతకూ ఏపీ రాజధాని అమరావతా.. విశాఖా..? సామాన్యుడి ప్రశ్నకు సమాధానం చెప్పేదెవరు..? లీడర్ల రాజకీయం ప్రజల్ని అయోమయ స్థితిలోకి నెట్టేసిందా..?

దేశంలోని మరే జాతికీ, ప్రాంతానికి లేనివిధంగా, రాజధాని లేన అయోమయ స్థితి కనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2013లో హైదరాబాద్ రాజధాని. విభజిత ఆంధ్రప్రదేశ్ కు 2016లో అమరావతి రాజధాని. ఇప్పుడు ఏపీ రాజధాని విశాఖ అంటున్నారు. అసలు రాజధాని అమరావతా.. విశాఖా అని గట్టిగా అడిగితే సూటిగా సమాధానం మాత్రం రాదు. ఆరేళ్లుగా రాజధాని చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది. పార్టీలు, నేతలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. కానీ సామాన్యుల సందేహాలకు మాత్రం ఇంతవరకూ ఫుల్ స్టాప్ పడలేదు. అసలు రాజధాని ఏదో ఇంతవరకూ ఇదమిత్థంగా నిర్ణయం జరగకుండా.. ఇక భవనాలు కట్టడం ఎళా సాధ్యమనేది మరో భేతాళ ప్రశ్న.

ఏపీలో ఇప్పుడు ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సామాన్యుడికి ఎక్కడ భూమి కొనాలో, ఎక్కడ స్థిరపడాలో అర్థం కాని పరిస్థితి ఉంది. వర్తమాన అవసరాలు, భవిష్యత్ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని సామాన్యులు ఎప్పుడూ రాజధాని పరిసరాల్లో స్థిరపడటానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏపీలో రాజధానిపైనే క్లారిటీ లేకపోవడంతో.. ఎవరికీ ఏమీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందని కానీ.. కచ్చితంగా విశాఖకు తరలిపోతుందని కానీ.. విశాఖలో అయినా గ్యారెంటీగా కొనసాగుతుందని కానీ.. ఎవ్వరూ తేల్చిచెప్పలేకపోతున్నారు.

ఎవరికి వారు రాజకీయ అవసరాల కోసం ఆలోచిస్తున్నారే కానీ.. రాష్ట్ర భవిష్యత్తు గురించి పట్టించుకోవడం లేదు. ఆరేళ్లుగా ప్రజల్ని అయోమయ స్థితిలోకి నెట్టేశామని అనుకోవడం లేదు. అమరావతిలోనే రాజధాని ఉండాలని టీడీపీ వాదిస్తుంటే.. పాలనా వికేంద్రీకరణే ముఖ్యమని వైసీపీ కౌంటరిస్తోంది. ఏపీ రాజధానిపై అస్పష్టతకు ఫలానా రాజకీయ పార్టీ కారణమని చెప్పడానికి వీల్లేదు. అన్నీ ఆతాను ముక్కలే అన్నట్టుగా ఈ ఎపిసోడ్ లో ఎవరి పాత్ర వారు పోషించారు. అమరావతిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు.. రాజధాని అక్కడే ఉండాలని ఏడాదిగా ఉద్యమం చేస్తున్నారు. వీరికి కౌంటర్ గా మూడు రాజధానులతోనే అభివృద్ధిద సాధ్యమని మరో ఉద్యమం కూడా రాజధాని గ్రామాల్లో జరుగుతోంది.

ఎవరికి వారు తమ వాదనే కరెక్టని వాదిస్తున్నారు. రాజధానిపై రిఫరెండం పెట్టాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. ప్రజలు మూడు రాజధానులకు ఓటేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. అయితే చంద్రబాబును ఇప్పటికే ప్రజలు పక్కనపెట్టారని వైసీపీ నేతలు కౌంటరిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news