నిజమని రుజువు చేస్తే “దేనికైనా రెడీ”: మంత్రి అంబటి రాంబాబు

-

ఈ మధ్యన ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై భూకుంభకోణానికి పాల్పడ్డారని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా మంత్రి స్పందించారు, నన్ను రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాకనే నాపై ఈ విధమైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు అంటూ విపక్షాలపై రెచ్చిపోయారు మంత్రి. నేను భూకుంభకోణం చేశాను అని ఆరోపణలు చేశారు నేను బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నా… నిరూపించండి అంటూ రెచ్చిపోయారు మంత్రి. ఒక పొలం చేతులు మారినంత మాత్రాన కుంభకోణం జరిగిందని తేల్చడం కరెక్ట్ కాదు అంటూ విపక్షాలను ఎండగట్టారు. నేను ఇన్ని కోట్ల అవినీతి చేశానని బయట చెప్పినా ఎవరూ నమ్మరు అని ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ అవినీతి నేను చేశానని నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటూ ఛాలెంజ్ విసిరారు.

మరి ఈ కుంభకోణంలో నిజంగా అంబటి రాంబాబు ప్రమేయం ఉందా లేదా అన్న విషయం తెలియాలంటే కొన్ని రోజుల వరకు చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news