మంత్రి పువ్వాడ: పొంగులేటి ఒక్క సీటు కూడా గెల్వలేడు…

-

ఎంపీ గా పనిచేసిన అనుభవం ఉన్న పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి ఈ మధ్యన పార్టీ నుండి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఈయన ఏ పార్టీలో చేరుతారని క్లారిటీ లేకపోయినా… బీజేపీలో చేరనున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ అతనిపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల పొంగులేటి కేసీఆర్ పై చేసిన కామెంట్స్ పైన అజయ్ ముఖ్యంగా ఫోకస్ చేశాడు. అజయ్ మాట్లాడుతూ కేసీఆర్ ను ఓడిస్తాను గద్దె దించుతాను అంటూ రంకెలు వేస్తున్నాడు అంటూ చమత్కారంగా మాట్లాడారు. పొంగులేటి నుండి ఇలాంటి మాటలు ఊరికే రావడం లేదని డబ్బు ఉందన్న గర్వంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఈసారి జరగనున్న ఎన్నికల్లో ఖమ్మంలో ఒక్క సీటును కూడా పొంగులేటి గెలుచుకోలేడన్నాడు. మరి పొంగులేటి ఈ కామెంట్ లపై ఏమైనా స్పందిస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news