భారత్ తో భారీ ఒప్పందానికి రెడీ అవుతున్న అమెరికా…?

భారతదేశంలో జాన్సన్ అండ్ జాన్సన్ వాక్సిన్ తయారికి ఆ సంస్థ రెడీ అవుతుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహా మరికొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకోవడానికి ఆ సంస్థ రెడీ అవుతుంది. సీరం కి హెల్ప్ చేయడానికి రెడీ అవుతున్నారని అమెరికా రాయబార కార్యాలయంకు చెందిన ఛార్జ్ డి అఫైర్స్ డేనియల్ బి స్మిత్ తెలిపారు. మంగళవారం ఆయన ఈ ప్రకటన చేసారు.

అదే విధంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇండియాలో కరోనా వాప్తి అమెరికా ఆందోళన చెందుతోంది అన్నారు. ఇది కేవలం మనుషుల తప్పు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రభావాలు ఇండియాలో కరోనా వ్యాప్తికి కారణం అయ్యాయి అని ఆయన వెల్లడించారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ని భారత్ కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా స్మిత్ వివరించారు.