Ukraine Crisis: ఉక్రెయిన్‌కు అమెరికా 600 మిలియన్ల డాలర్ల ఆర్థిక సాయం

-

ఉక్రెయిన్‌ క్రైసిస్‌ నేపథ్యంలో… ఆ దేశానికి అగ్ర రాజ్యం అమెరికా భారీగా ఆర్థిక సహాయం చేసింది. ఏకంగా 600 మిలియన్‌ డాలర్ల సాయాన్ని అందించింది ఆమెరికా. తక్షణ సైనిక అవసరాలకు ఇది వినియోగించుకోవచ్చని.. స్పష్టం చేసింది బైడెన్‌ సర్కార్‌.

ఉక్రెయిన్‌ ను అన్ని రకాలుగా ఆదుకుంటామని.. ఇప్పటికే ఆమెరికా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ పై రష్యా దండయాత్ర ప్రారంభించగానే.. ఆమెరికా రష్యాపై అనేక ఆంక్షలను విధించింది. దీంతో పాటు… ఉక్రెయిన్‌ ను అన్ని రకాలుగా అండగా… ఉంటామని చెప్పేం దుకు భారీ ఆర్థిక సాయాన్ని చేసింది బైడెన్‌ సర్కార్‌. ఇది ఇలా ఉండగా.. ఉక్రెయిన్ వదిలి వెళ్లేది లేదని స్పష్టం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షడు వోలోడిమిర్ జెలెన్ స్కీ. కీవ్ నగర వీధుల్లో తిరుగుతూ… ఎమోషనల్ వీడియో ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈపోస్ట్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. నాకుటుంబంతో పాటు కీవ్ లో ఉంటానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news