నేను ఇంకా వైసీపీ పార్టీలోనే ఉన్నానని సైదాపురం మండల నేతలతో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. నియోజకవర్గ ఇంచార్జి వల్ల ఏమీ కాదని..ప్రజల్లో బలం ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు. ఆ నేతలు వద్దన్నా ఇంత మంది రావడం సంతోషమని.. వైసీపీ నేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. అయినా భయపడాల్సిన పని లేదు..మనం ఇంకా వై.సి.పి.నుంచి బయటకు రాలేదు…వాళ్ళు మనల్ని బయటకు పంపలేదని స్పష్టం చేశారు.
వై.సి.పి.ప్రభుత్వంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని..పంచాయతీలకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం వాడు కుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా రూ.100 కోట్లవిలువైన సి.సి.రోడ్లు..డ్రైన్లు వేసుకోవా లని చెప్పారని..కానీ భయపడి రూ.17 కోట్ల విలువైన రోడ్లు మాత్రమే వేశారన్నారు. ఇందులో రూ.5 కోట్లు మాత్రమే వచ్చాయి..ఇంకా రూ.12 కోట్లు రావాలని..సచివాలయాలు..ఆరోగ్య కేంద్రాల భవనాలను నిర్మాణం చేసినా నిధులు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. అప్పుల పాలయ్యామని చెబుతుంటే బాధ కలిగిందని..వాటి గురించి నేను అడిగాన్నారు. ఏ పార్టీలో ఉన్నా..ప్రజా బలం అవసరమని తెలిపారుమాజీ మంత్రి ఆనం రామనారాయణ.