వైసీపీ ప్రభుత్వంపై ఆనం సంచలన వ్యాఖ్యలు

-

వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరోసారి వైసీపీ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఏపీలో వైసీపీ దుర్మార్గపు పాలన కొనసాగుతోందని, అంతమొందించడానికి అందరూ కలిసి రావాలని అన్నారు.

టీడీపీలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన ఆనం రామనారాయణరెడ్డి | venkatagiri mla Anam  Ramanarayana Reddy comments - Telugu Oneindia

రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు అధికారం లేదు, ఎంపీలకు అధికారం లేదు, గ్రామానికి అధ్యక్షుడైన సర్పంచికి కూడా అధికారం లేదు అని వెల్లడించారు. వాలంటీర్ కు ఉన్న అధికారం ఇక్కడ ఎమ్మెల్యేకి లేదని, ఈ విషయం చెప్పడానికి తానేమీ బాధపడడంలేదని తెలిపారు. ఈ నాలుగేళ్లలో అన్ని చూసి, ఇప్పుడు దూరంగా ఉంటున్నానని అన్నారు. రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల నుంచి గ్రామపంచాయతీ సమావేశాల వరకు దేనికీ విలువ లేకుండా పోయిందని తెలిపారు.

ప్రతి మంగళవారం రూ.3 వేల కోట్లు అప్పులు తెస్తున్నారని, ఆ లెక్కన ఎన్ని మంగళవారాలు వస్తాయి, అప్పు ఎంతవుతుంది? అని ఆనం ప్రశ్నించారు. “పోలవరం ప్రాజెక్టు కట్టలేమని నిలిపివేశారు. పవర్ ప్రాజెక్టులు అమ్మేసే పరిస్థితికి వచ్చారు. ప్రారంభానికి ముందే అమ్మకం టెండర్లు పిలిచే పాలన ఎక్కడైనా ఉందా? అందుకు ఉదాహరణ కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టు. ప్రారంభోత్సవానికి ముందే 99 ఏళ్ల లీజుకు టెండర్లు పిలిచారు. ఇవాళ జనం కూడా నవ్వులపాలవుతున్నారు. ఏపీ ప్రజలను చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు నవ్వుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news