ఏపీ:స్టేట్ బ్యాంక్ క్యాషియర్ 7కోట్ల కుంభకోణం.. సీబీఐ కేసు నమోదు.

-

స్టేట్ బ్యాంకు క్యాషియర్ 7కోట్ల కుంభకోణంలో పాలు పంచుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. సఖినేటి పల్లి గ్రామంలో స్టేట్ బ్యాంకులో పని చేస్తున్న రాపాక వెంకట రమణ మూర్తిపై సీబీఐ కేసు నమోదైంది. బంగారు ఆభరణాల రుణాల మంజూరు విషయంలో స్టేట్ బ్యాంక్ క్యాషియర్ 7కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడనే ఆరోపణతో కేసు నమోదు చేసారు. ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రదారిగా క్యాషియర్ అని సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ విషయంలో సీబీఐ దర్యాప్తు జరుపుతుంది.

ఈ కుంభకోణం వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయం దర్యాప్తులో తేలనుంది. ప్రస్తుతానికి క్యాషియర్ వెంకట రమణమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు సంబంధిత విషయాల్లో కుంభకోణాలు వెలుగు చూడడం ఇది కొత్త కాదు. కానీ, ఇలాంటి సంఘటనలు బ్యాంకులపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత సన్నగిల్లేలా చేస్తున్నాయి. 7కోట్ల కుంభకోణంలో క్యాషియర్ కి సహాయకులుగా ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో!

Read more RELATED
Recommended to you

Latest news