వెల్లుల్లి పొట్టు తీయడానికి కష్టపడుతున్నారా? ఈ పద్దతులు పాటించండి.

-

ఆహారం తయారు చేయడంలో అత్యంత కీలకమైనది దాని కోసం ఇతర ఆహార పదార్థాలను ప్రిపేర్ చేసుకోవడం. కూర వండడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కానీ కూరగాయల పొట్టు తీసి, తరిగి మొదలైనవి చేయాలంటేనే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఈ కష్టం ఇంకా ఎక్కువగా ఉండేది వెల్లుల్లి పొట్టు తీయడంలోనే. అవును, చాలామందికి ఇది పెద్ద బోరింగ్ గా అనిపిస్తుంది. ఒక్కొక్క వెల్లుల్లి రెబ్బ పొట్టు తీయడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఐతే మీకిది తెలుసా? వెల్లుల్లి పొట్టుని చాలా సులభంగా తీయడానికి కొన్ని చిట్కాలున్నాయి.

వెల్లుల్లి

దీనివల్ల ఎంత వెల్లుల్లి ఉన్నా చాలా ఈజీగా పొట్టు తీసేయవచ్చు. ముందుగా, వెల్లుల్లి పొట్టు తీయాలనుకుంటే వాటిని ఒక 20నిమిషాల పాటు మైక్రోవేవ్ ఓవెన్ లో ఉంచడం మంచిది. ఆ తర్వాత వెల్లుల్లి పొట్టు చాలా సులభంగా తొలగిపోతుంది. ఐతే ఇది అన్ని వంటకాలకి వర్కౌట్ అవదు. ఎందుకంటే మైక్రోవేవ్ ఓవెన్ లో కొద్దిసేపు ఉంటాయి కాబట్టి సగం ఉడుకుతాయి. అలా సగం ఉడికిన వెల్లుల్లి కొన్ని వంటకాలకు పనిచేయదు.

ఇంకా, చాలా పాత పద్దతి గురించి తెలుసుకుందాం. రెండు పాత్రలు తీసుకుని దానిలో వెల్లుల్లి ఉంది గట్టిగా ఊపితే పెద్ద పెద్దగా వెల్లుల్లి నుండి పొట్టు తొలగిపోతుంది. ఇది చిన్న వెల్లుల్లి రెబ్బలకి పనిచేయదు. వాటి నుండి పొట్టు తొలగిపోదు.

ఇక మూడవ పద్దతికి వస్తే, వెల్లుల్లి అడుగు భాగంలో కత్తితో కోసి తీయాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా ఈజీగా పొట్టు తీయవచ్చు. కాకపోతే ఎక్కువ వెల్లుల్లి ఉన్నప్పుడు ఇది కష్టంగా అనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news