రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రజా సమస్యలపై స్పందించడం కేటీఆర్ వ్యవహరించే తీరు చాలా విభిన్నంగా ఉంటుంది. సోషల్ మీడియాలో గానీ మామూలుగా ఏదైనా ప్రాంతంలో పర్యటించే సందర్భంలో గాని చాలా చాకచక్యంగా సమస్యకి కేటీఆర్ పరిష్కారం చూపిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కడికక్కడ రాకపోకలను నిలిపి వేయడంతో హైదరాబాదు ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన శివయ్య అనే యువకుడు ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కి తన సంతోషం వెల్లడించారు…“కరోనా వ్యాపిస్తున్న తరుణంలో, కరోనని కట్టడి చేసే పనిలో భాగంగా మొదట్లో నన్ను ఏపీకి వెళ్లకుండా తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది.తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకున్న చర్యలు, శ్రద్ధ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నేను చాలా సురక్షితంగా ఉన్నాను. ఇకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు, అన్ని ప్రాంతాల ప్రజలను కూడా ఎంతో క్షేమంగా చూసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు” అని శివయ్య ముండ్లపాటి ట్విట్టర్ వేదిక ద్వారా పోస్టు చేశారు.
ఈ విధంగానే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మందిని తెలంగాణ ప్రభుత్వం దగ్గరుండి జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్లకి కావలసిన ఆహారాన్ని అందిస్తూ పోషిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పై చాలామంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోపక్క ఈ టైంలో రాజకీయాలను పక్కన పెట్టి మానవతా దృక్పథంతో వ్యవహరించడంతో ఆంధ్రుల మనసు కూడా కేటీఆర్ గెలుచుకున్నారు.