ఆంధ్ర ప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. అందులో భాగంగానే ఇప్పటికే పలు పార్టీలు వ్యూహాలకు సంబంధించిన కసరత్తులు ప్రారంభించాయి . శ్రీకాకుళం జిల్లాలో పాత్రునివలస, పెద్దపాడు ప్రజలకు మంచినీటిని అందించడానికి రూ.24 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ. అక్కడికి వచ్చిన ప్రజలకు ఆయన ఓ ప్రశ్న వేశారు.. ఈ సారి నేను వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలా ? వద్దా? మీరు వద్దు అంటే పోటీ మానేస్తాను అంటూ ప్రజల్ని ప్రశ్నించారు మంత్రి ధర్మాన.. అంతేకాదు.. నేను పోటీ చేయొద్దు అనేవాళ్లు చెయ్యి ఎత్తాలని సభికులను కోరగా అందులో ఎక్కువ మంది ప్రజలు పోటీ చేయాలని కోరారు.
టీడీపీ దొంగలు మీ ఇళ్లకు వచ్చి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామంటే నమ్మొద్దని కోరారు. 14 సంవత్సరాలు అధికారంలో ఉండి చంద్రబాబు ఉచితంగా సిలిండర్లు ఎందుకు ఇవ్వలేదని అన్నారు.
మన గుర్తు ఫ్యాన్ గుర్తుగా అని అందరికీ చెప్పండి అని విజ్ఞప్తి చేశారు.మరోవైపు రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా మీకు పనిచేస్తుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు గుర్తుచేశారు .