ఈ ఫోటో వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటబ్బా..?

-

సోషల్ మీడియాలో వార్తలు క్షణంలో తెలిసిపోతాయి.. కొన్ని నిజమైన వార్తలు ఉంటే, మరి కొన్ని ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఆంధ్రప్రదేశ్ బస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ ఫొటోలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు.పూర్తి స్థాయిలో వర్షం నుంచి రక్షణ కల్పించే విధంగా ఒక ప్లాస్టిక్ టర్బన్ తో కవర్ చేసి ఉంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ.. రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 300 తాటాకు, 30 కట్టల గడ్డి తెచ్చి కూడా బస్సులపై కట్టే ఉంటారు అంటూ వింత కామెంట్స్ వస్తున్నాయి..

ఏపీఎస్ ఆర్టీసీ దుస్థితికి ఇది నిదర్సనం అంటూ ఏపీ సర్కారుపై కూడా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.. తాజాగా ఈ విషయం పై విజయవాడ ఆర్టీసీ ఈడి స్పందించారు.బస్సుల గురించి తప్పుడు సమాచారం ఇవ్వొద్దని సూచించారు.ఆర్టీసీ బస్సుల్లో తాము ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు సరఫరా చేస్తున్నామని తెలిపారు. జులై 4 లోపు ప్రతి ప్రభుత్వ పాఠశాలకు పుస్తకాలను సరఫరా చెయ్యాల్సి ఉన్నందున.. కొన్ని పుస్తకాల తరలింపుకు బస్సులను ఎంచుకున్నామని వెంకటేశ్వర రావు చెప్పారు.

ఈ నేపథ్యంలో తగిన రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే కోనసీమ జిల్లాకు ఇప్పటి వరకు 64 లక్షల పుస్తకాలు రవాణా చేశామని తెలిపారు. అయితే అసలు విషయం తెలుసుకోకుండా.. సోషల్ మీడియా వేదికగా ఆర్టీసీ కి సంబంధించి అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు..మొత్తానికి ఈ ఫోటో కాస్త వైరల్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news