మరికొద్ది రోజుల్లో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ముప్పవరపు వెంకయ్య నాయుడు పదవీ కాలం పూర్తి కానుంది. ఇదే సందర్భంలో ఆయనకు వీడ్కోలు పలికేందుకు బీజేపీ,బీజేపీయేతర ప్రతినిధులు సమాయత్తం అవుతున్నారు. మరోవైపు కొత్త రాష్ట్రపతి రాక నేపథ్యంలో కొత్త సమీకరణాలు కొన్ని పోగవుతున్నాయి. వీటి అనుగుణంగానే రాజకీయం కూడా మారిపోతున్నది. అందుకే బీజేపీ బలమైన అభ్యర్థినే బరిలోకి దించి విపక్షాల నోళ్లు మూయించింది. ఒడిశా టీచరమ్మ ద్రౌపదీ ముర్మూను బరిలోకి దించింది. ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ బీఎస్పీ అధినేత్రి మాయావతి తో పాటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రకటనలు చేశారు.
మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఆమె నిరాడంబరత కారణంగానే ఇంతటి పేరు దక్కించుకున్నారు. గతంలో కూడా ఝార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ గా పనిచేసినప్పుడు కూడా ఆమె నిరాడంబరంగానే ఉంటూ కొన్ని మంచి పనులకు శ్రీకారం దిద్దారు. అంతకుమునుపు కూడా ఆమె బీజేపీ -బిజూ జనతాదళ్ పార్టీ కూటమి నేతృత్వంలో ఏర్పాటయిన సర్కారులో కూడా మంత్రిగా పదవీ బాధ్యతలు అందుకుంటూనే, సాదాసీదా జీవితం గడిపారు. ఆ రోజు ఆమెకు సొంత వాహనం కూడా లేదు. మరి ! ఆమె అభ్యర్థిత్వంపై నాయుడి గారి మనుషులకు ఉన్న అభ్యంతరాలు ఏంటి ? ఎవరు ఆమెను అర్థం చేసుకోలేకపోతున్నారు ? ఆమెకు అండగా నిలిచి హుందాతనం చాటుకోవాల్సిన కొన్ని తెలుగు ప్రసార మరియు ప్రచురణ మాధ్యమాలు కూడా దరిద్రగొట్టు రాతలు రాస్తున్నాయే !
ఇప్పుడిక రాజసౌధం వీడి వెంకయ్య రావాల్సిన తరుణం వచ్చేసింది.ఆయనకు పదవి ఇవ్వడం, ఇవ్వకపోవడం అన్నవి బీజేపీ అంతర్గతం. కానీ కోపాలను బహిర్గతం చేయడంతోనే సంబంధిత వర్గాలు దేశంలో పరువు పోగొట్టుకుంటున్నాయి. అంతేకాదు ఇదే సమయాన పంచెకట్టు పెద్దాయన పరువు కూడా తీస్తున్నాయి. కనుక ఆయన హుందాగా తప్పుకోవాలి.. ఓ మైనార్టీకి ఉప రాష్ట్రపతి పదవిని కట్టబెట్టాలన్న ఆలోచన ఒకటి చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ మాటకు ఆ హామీకి మద్దతుగా ఉంటే వెంకయ్య పెద్దరికం నిలబెట్టుకున్న వారవుతారు. అయినా ఆయన విశ్రాంతి తీసుకునేందుకు పదవీ కాలం తరువాత జీవితాన్ని సుఖవంతంగా మరియు సౌకర్యవంతంగా గడిపేందుకు ఢిల్లీలో ఉన్న భవనాలలో ఏదో ఒక భవనం ఎందుకని ఎంచుకోవడం లేదని ? ఎవ్వరైనా అధికారి పోయి అడిగితే ఇదే విషయమై ఆగ్రహంతో ఊగిపోతున్నారెందుకని? అయినా పదవి నుంచి దిగిపోయే వేళ కూడా వెంకయ్య ఇంకా పూర్వ కాల హుందాతనాన్నే పొంది ఉండాలి. వదులుకోకూడదు కదా ! మునుపటి హుందాతనం కోల్పోయి ఆయన ప్రవర్తిస్తే ఎవ్వరైనా నవ్వుకుంటారు. కనుక వెంకయ్య గారూ మీరు నవ్వుల పాలు కాకుండ్రి ! హాయిగా మిగిలిన జీవితాన్ని ఇంతే హుందాతనంతో గడుపుండ్రి ! ఏం కాదు .. ఆల్ ద బెస్ట్ సర్.