చంద్రబాబు చేష్టలకు కడుపు రగులుతోంది : జగన్

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేష్టలకు తన కడుపు రగులుతోందని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా గుడివాడలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్ మీద ఒక్క రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు.  ఈ తాటాకు చప్పళ్లుకు మీ బిడ్డ అదరడు.. బెదరడు. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో.. కానీ పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు.

ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణమయ్యాడని సంచలన ఆరోపణలు చేశాడు. చంద్రబాబుకు మనసు లేదు.. మానవత్వం లేదని, ఆయనకు తెలిసింది కేవలం దోచుకోవడం.. పంచుకోవడం ఒక్కటేనని విమర్శించారు. దాడులు, మోసాలు, కుట్రలు, చంద్రబాబు నైజం అన్నారు. మహిళల పాలిట చంద్రబాబు మొదటి విలన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news