మీరు వేసే ఓటు పేదల భవిష్యత్ నిర్ణయిస్తుంది.. ఆలోచించి ఓటు వేయండని సూచించారు సీఎం జగన్. తాజాగా పాయకరావు పేట నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోవడమే అన్నారు. విలువలకు, విశ్వసనీయతకు ఓటు వేయడానికి మీరంతా సిద్ధమా అని ప్రశ్నించారు. అవ్వ, తాతలకు ఇంటి వద్దనే పెన్షన్ అందించడం విప్లవం.. అవునా..? కాదా అని ప్రశ్నించారు.
59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. అందుకే చంద్రబాబుకు మన మీద పిచ్చి కోపం వస్తుందని తెలిపారు. పేద విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం, డిజిటల్ బోధన, 93 శాతం పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ కల్పించామని తెలిపారు. అమ్మఒడి పథకం ఎప్పుడైనా ఇచ్చారా..? రైతు భరోసా ఎప్పుడైనా ఇచ్చారా..? అని ప్రశ్నించారు. రైతన్నలకు పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ కల్పించామన్నారు. 59 నెలల మీ జగన్ పాలనలోనే ఇవన్ని విప్లవాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతీ పేదకు అండగా నిలుస్తూ.. పేదవాడు అప్పుల పాలకావద్దని ఆరోగ్య శ్రీని విస్తరించామని తెలిపారు.