స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా వాలంటీర్ల జీవితాలు మారుస్తాం : చంద్రబాబు

-

రాష్ట్రంలోని వాలంటీర్ల జీవితాలు మారుస్తానని టీడీపీ ఛీప్ చంద్రబాబు అన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు రూ.30వేల నుంచి రూ.50వేల సంపాదించుకునేవిధంగా చేస్తానన్నారు. జగన్ పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత అల్లాడుతున్నారని  ఆరోపించారు చంద్రబాబు. ఏటా జాబ్ కేలండర్ అంటూ నిలువునా ముంచారని మండిపడ్డారు.

వైసీపీ నాయకులు సర్వే నంబర్లు మార్చి సామాన్యుల నుంచి భూములు లాక్కుంటున్నారు. కుప్పంలోనే నన్ను బెదిరిస్తున్నారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఖనిజ సంపద దోచేస్తున్నారు. మద్యం, గంజాయి విక్రయించి డబ్బు సంపాదిస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జే బ్రాండ్ మద్యాన్ని అరికడతాం. యువతలో సామాజిక స్పృహ, సామాజిక భాద్యత ఉండాలి. రాష్ట్రాన్ని కాపాడాలనే మూడు పార్టీలు కలిసి మీ ముందుకు వచ్చాయి. జెండాలు మూడు.. అజెండా మాత్రం ఒక్కటే. రాష్ట్రంలో పాలనను మళ్లీ గాడిన పెట్టే బాధ్యత నాది. ఐటీని ప్రోత్సహించి యువతకు కొత్త దారి చూపించా. టెక్నాలజీ దుర్మార్గుల చేతిలో పడితే ప్రమాదకరం. పారదర్శకంగా జరగాల్సిన టెండర్లలోనూ అవకతవకలకు పాల్పడుతున్నారు. భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం. అన్ని మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు నిర్మిస్తాం. మేం వచ్చాక ప్రతి నియోజకవర్గానికి విజన్ తయారు చేస్తామన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news