అమరావతి రైతులకు శుభవార్త చెప్పింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. అమరావతి రైతులకు 2023-24 గాను చెల్లించాల్సిన రూ. 240 కోట్ల కౌలు మొత్తాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. 26 వేల మంది రైతులకు గాను 30వేల ఎకరాలకు కౌలు చెల్లించాల్సి ఉంది.
నిన్నటి వరకు 16,395 మందికి చెందిన 18,755 ఎకరాలకు రూ. 120 కోట్లు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులోగా అర్హులైన వారందరి ఖాతాల్లో డబ్బు జమ చేస్తామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే తుళ్లూరు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
కాగా, 2 వేల సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా ఇప్పటికే గుర్తించగా, తాజాగా మరో 195 ఆఫీసులకు అలాంటి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అనకాపల్లి, చిత్తూరు, కృష్ణ, పార్వతీపురం, నెల్లూరు, శ్రీకాకుళం, TPT, విజయనగరం, YSR, ప్రకాశం, కోనసీమ, ఏలూరు, కర్నూలు జిల్లాల పరిధిలో ఈ కార్యాలయాలు ఉన్నాయి. కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా, డిజిటల్ అసిస్టెంట్లను వారికి సహాయకారిగా నియమించింది.