త్వరలో వైద్య శాఖలో 38 వేల ఉద్యోగాలు..మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

-

చిత్తూరు జిల్లా పుంగనూరు లో ఇంధన, అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు.పుంగనూరు కమ్యూనిటీ ఆసుపత్రిలో హై డిపెండెన్సీ పీడియాట్రిక్ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..వినూత్నంగా కార్పొరేట్ స్థాయిలో పిల్లల కోసం అత్యాధునిక యూనిట్ ను ఏర్పాటు చేశామన్నారు.యోగదా సత్సంగ సొసైటీని ప్రత్యేకంగా అభినందించారు.త్వరలో వైద్య శాఖలో 38 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం అన్నారు.పుంగనూరులో ఏరియా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ను కోరినట్టు తెలిపారు.త్వరలోనే ఏరియా ఆసుపత్రిని ప్రకటిస్తామన్నారు.

ఉద్యోగాలు భర్తీ చేసిన అనంతరం పూర్తిస్థాయిలో సిబ్బంది అందుబాటులోకి వస్తారని అన్నారు.ఆ తర్వాత పుంగనూరు ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రి గా మారుస్తాము అన్నారు.కరోనా సమయంలో దీన్ని 100 బెడ్ల ఆసుపత్రిగా మార్చామని అన్నారు.గతంలో లాగా ఇతర పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకునే అవసరం లేకుండా ఇతర పట్టణాల వారే ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే లా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు.పుంగనూరు చెరువు సుందరీకరణ కు కోటి రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.త్వరలోనే ఆ నిధులు కూడా మంజూరు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news