ఆరోగ్య‌శ్రీ కింద 50శాతం బెడ్లు ఇవ్వాల్సిందేః సీఎం జ‌గ‌న్

కరోనా రోగుల‌కు సీఎం జ‌గ‌న్ గుడ్ న్యూస్ చెప్పారు. పేషెంట్లంద‌రికీ ఆరోగ్య‌శ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తామ‌ని చెప్పారు. ఈ మేర‌క‌కు క్యాంపు ఆఫీసులో బుధ‌వారం అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఆరోగ్య‌శ్రీ కింద రోగుల‌కు ప్ర‌యివేటు ఆస్ప‌త్రులు 50శాతం బెడ్లు ఇవ్వాల్సిందే అని స్ప‌ష్టం చేశారు.

జిల్లాల్లో కలెక్ట‌ర్ల నోటిఫై చేసి బెడ్ల‌ను కేటాయించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. క‌రోనా ఆస్ప‌త్రుల్లో మెరుగైన స‌దుపాయాలు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. త‌గినంత ఆక్సిజ‌న్ నిల్వ‌లు ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని స‌మీక్షించాల‌ని అధికారుల‌కు సూచించారు. మినిట్ టు మినిట్ అప్‌డేట్ చేయాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు చెప్పారు.