శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య…అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు

-

శ్రీకాకుళంలో విషాదం చోటు చేసుకుంది. ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురం గ్రామం ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వసతి గృహంలో మూడో ఫ్లోర్ నుంచి బుధవారం అర్ధరాత్రి దూకేశాడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆర్. ప్రవీణ్ నాయక్. ఈ తరుణంలోనే…ఐటీ విద్యార్థి ఆర్. ప్రవీణ్ నాయక్ ను శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో క్యాంపస్ అంబులెన్స్ లో చేర్పించాడు అధికారులు.

atc

కానీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఐటీ విద్యార్థి ఆర్. ప్రవీణ్ నాయక్ మృతి చెందాడు. ఎస్ఎం పురం క్యాంపస్లో సివిల్ ఇంజనీరింగ్ మొదటి ఏడాది చదువుతున్నాడు ఆర్. ప్రవీణ్ నాయక్. మృతి చెందిన ఐటీ విద్యార్థి ఆర్. ప్రవీణ్ నాయక్ ది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం. ఇక ఐటీ విద్యార్థి ఆర్. ప్రవీణ్ నాయక్ మృతి కారణం పై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో విద్యార్థి మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు… ఇంజనీరింగ్ ప్రధమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రవీణ్ నాయక్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తక్షణమే తెలపాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version