ఏపీ అప్పులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలి – చంద్రబాబు

-

ఏపీ అప్పులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. పోలవరంపై సీఎం జగన్ ఇప్పుడేం సమాధానం చెబుతారు..? కేంద్ర ప్రభుత్వ వ్యవస్థల నుంచి నిపుణల నివేదికల వరకూ జగన్ ప్రభుత్వానిదే తప్పని తేల్చారన్నారు. పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను పీపీఏ, కేంద్రం, నిపుణుల కమిటీ తేల్చి చెప్పాయి… పోలవరం పరిహారంపై నాటి జగన్ హామీలు ఏమయ్యాయి..? అని నిలదీశారు.

పేదలకు ఇచ్చింది జగనన్న కాలనీలు కాదు.. జలగన్న కాలనీలు అని.. రాష్ట్రంలో బడులు మూస్తున్నారు.. బార్లు తెరుస్తున్నారని ఆగ్రహించారు. గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నూరు శాతం విఫలమని.. 2014లో నా ప్రయత్నం కారణంగా ఏపీలో చేరిన పోలవరం విలీన గ్రామాలు.. ఇప్పుడు ఈ ప్రభుత్వ వైఖరితో మళ్లీ తెలంగాణలో కలపాలనే డిమాండ్ చేస్తున్నాయన్నారు.

పోలవరం ముంపు బాధితులకు ఆర్ అండ్ ఆర్ పరిహారం పై జగన్ ఇచ్చిన హామీలు, పునరావాస కాలనీల నిర్మాణం ఏమయ్యాయని నిలదీశారు. రాష్ట్రంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ విషయంలో విద్యాశాఖ దారుణంగా విఫలమైందని.. రాష్ట్రంలో బడులను విలీనం పేరుతో మూసేస్తున్న ప్రభుత్వం.. బార్లను మాత్రం తెరుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 1.42 కోట్ల కార్డు దారులందరికీ బియ్యం పంపిణీ చెయ్యాలి… అప్పుల విషయంలో ప్రభుత్వం సమాధానం పెద్ద బూటకమని మండిపడ్డారు.
ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news