ఎడిట్ నోట్: మునుగోడు ‘ముక్కోణం’!

-

మొత్తానికి తెలంగాణలో మరో ఉపఎన్నిక రానుంది…కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇన్నేళ్లు కాంగ్రెస్ లో పనిచేసిన ఆయన…తెలంగాణలో బీజేపీ బలపడటం…అదే సమయంలో కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ రెడ్డికి దక్కడంతో…ఒక్కసారిగా ఆలోచనలు మార్చుకున్నారు. కొన్ని నెలల క్రితమే ఆయన బీజేపీ పెద్దలతో టచ్ లోకి వెళ్లారు.

అయితే సమయం బట్టి కోమటిరెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ పెద్దలు భావించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన చేరికకు రంగం సిద్ధం చేశారు. అది కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉపఎన్నికలో పోటీ చేసేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే కేసీఆర్ అనైతికంగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలని లాక్కున్నారు. కానీ అలా తీసుకోకూడదని చెప్పి…గతంలో ఈటలతో రాజీనామా చేయించి ఎలా బీజేపీలో చేర్చుకున్నారో అదే మాదిరిగా కోమటిరెడ్డి చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి బీజేపీలో చేర్చుకొనున్నారు.

ఇలా చేయడం వల్ల బీజేపీకే అడ్వాంటేజ్ అవుతుంది. ఇక కోమటిరెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక దాదాపు అనివార్యమే. ఇక ఉపఎన్నిక వస్తే మునుగోడులో ముక్కోణపు పోరు జరగడం ఖాయం. టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉపఎన్నిక వస్తుందని చెప్పి అధికార టీఆర్ఎస్ అలెర్ట్ అయింది..మునుగోడులో పనులు చేయడం మొదలుపెట్టింది….ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలని పరిష్కరించడానికి చూస్తుంది..కోట్లు గుమ్మరించి అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధమవుతుంది.

అలాగే నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులని టీఆర్ఎస్ వైపుకు తిప్పుకుంటుంది. తమ గెలుపుకు కావల్సిన అన్నీ అస్త్రాలని టీఆర్ఎస్ పార్టీ సమకూర్చుకుంటుంది. ఇక ముందు నుంచి మునుగోడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట…కానీ అది కోమటిరెడ్డి ఫ్యామిలీ ఉన్నంత వరకే..ఇప్పుడు రాజగోపాల్ బీజేపీలోకి వెళుతున్నారు. దీంతో కాంగ్రెస్ లో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి..తన తమ్ముడుని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా సాయపడతారనేది చూడాలి. పైకి కాంగ్రెస్ కి పనిచేసిన…అంతర్గతంగా తమ్ముడు కోసం పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

అయితే కాంగ్రెస్ తరుపున మునుగోడులో బలమైన అభ్యర్ధిని పెట్టేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు. అలాగే కాంగ్రెస్ శ్రేణులు..బీజేపీ, టీఆర్ఎస్ వైపు వెళ్లిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇంతవరకు ఏ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ సత్తా చాటలేదు…అందుకే ఈ ఉపఎన్నికని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక బీజేపీ విషయానికొస్తే కోమటిరెడ్డి మాత్రమే..ఆ పార్టీ ప్రధాన బలం. ఎందుకంటే మునుగోడులో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు.

మొత్తం కోమటిరెడ్డి చూసుకోవాల్సిందే…వ్యక్తిగతంగా కోమటిరెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది…అలాగే తనతో పాటు కాంగ్రెస్ శ్రేణులని బీజేపీలోకి తీసుకురానున్నారు. అలాగే ఇప్పుడు మునుగోడులో టీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమాలు చేసిన అవి…రాజగోపాల్ వల్లే అని ప్రజలు భావించే పరిస్తితి ఉంది. ఈ అంశం కోమటిరెడ్డికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే మునుగోడులో ముక్కోణపు పోరు జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news